Skip to main content
Source
Dishadaily
https://www.dishadaily.com/national/brs-aap-top-as-regional-party-with-highest-donations-207834
Author
Disha Web
Date

దిశ, వెబ్‌డెస్క్: గడిచిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో విరాళాల్లో BRS, AAP అగ్రస్థానంలో ఉన్నాయి. దీనిని ADR అనే నివేదిక స్పష్టం చేసింది. ఈ నివేదిక ప్రకారం భారత రాష్ట్ర సమితి (BRS) అత్యధికంగా ₹40.9 కోట్ల విరాళాన్ని అందుకుని మొదటి స్థానంలో ఉంది. అలాగే ₹38.243 కోట్ల విలువైన విరాళాలతో AAP రెండవ స్థానంలో ఉండగా.. JD(U) ₹33.257 కోట్లతో మూడో స్థానంలో ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఏఐఏడీఎంకే, బీజేడీ, ఎన్‌డీపీపీ వంటి పార్టీలు తమకు వచ్చిన ఎలాంటి విరాళాలు ప్రకటించలేదని నివేదిక పేర్కొంది.


abc