Source: 
Mana Telangana
https://www.manatelangana.news/electoral-bonds-worth-rs-3429-cr-redeemed-in-2019-20/
Author: 
Date: 
28.08.2021
City: 

న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల ద్వారా 2019-20 ఆర్థిక సంవత్సరానికి జాతీయ,ప్రాంతీయ పార్టీలు రూ.3,429.56 కోట్లు సేకరించాయి. ఇందులో 87.29 శాతం విరాళాలు పొందింది జాతీయ పార్టీలైన బిజెపి, అని ఎన్నికల పరిశీలనా సంస్థ అసోసియేషన్ ఫర్ డెమో క్రటిక్ రిఫార్మ్(ఎడిఆర్) పేర్కొన్నది. ఆర్‌టిఐ ద్వారా ఎస్‌బిఐ నుంచి రాజకీయ పార్టీల విరాళాలకు సంబంధించిన డేటాను ఎడిఆర్ సేకరించిం ది. 2019-20లో బిజెపి పొందిన మొత్తం విరా ళాల విలువ రూ.3623.28 కోట్లు కాగా, అందు లో 45.57 శాతం అంటే రూ.1651.022 కోట్లు ఆ పార్టీ ఎన్నికల కోసం ఖర్చు చేసినట్టు లెక్కలు చూపింది. అదే సమయంలో టిఎంసి రూ. 143.676 కోట్లు పొందగా, 74.6 శాతం అంటే రూ.107.277 కోట్లు ఖర్చు చేసింది.

2019-20లో ఏడు జాతీయ పార్టీలు (బిజెపి, కాంగ్రెస్, ఎన్‌సిపి, బిఎస్‌పి, ఎఐటి సి, సిపిఐ) పొందిన మొత్తం విరాళం రూ. 475 8.206 కోట్లు అని ఎడిఆర్ తెలిపింది. ఎన్నికల బాండ్ల ద్వారా బిజెపి రూ.2555.0001 కోట్లు, కాంగ్రెస్ రూ.317.861 కోట్లు, ఎఐటిసి రూ. 100.4646 కోట్లు, ఎన్‌సిపి 20.50 కోట్లు విరా ళంగా పొందాయి. 2018-19తో పోలిస్తే బిజెపికి లభించిన విరాళాలు 50.34 శాతం (రూ. 1213.20 కోట్లు) పెరిగాయి. 2018-19లో ఆ పార్టీకి లభించిన విరాళాల మొత్తం రూ. 2410. 08 కోట్లు కాగా, 2019-20లో రూ.3623.28 కోట్లు. అదే సమయంలో కాంగ్రెస్‌కు లభించిన విరాళాల్లో 25.69 శాతం తగ్గడం గమనార్హం. 2018-19లో కాంగ్రెస్‌కు లభించిన విరాళాల మొత్తం రూ. 918.03 కోట్లు కాగా, 2019-20లో రూ.682.21 కోట్లు.

© Association for Democratic Reforms
Privacy And Terms Of Use
Donation Payment Method