Skip to main content
Source
Telugu.samayam
https://telugu.samayam.com/telangana/news/brs-party-tops-in-regional-parties-donations-as-per-adr-report/articleshow/99760835.cms
Author
Ramprasad
Date

దేశంలోని ప్రాంతీయ పార్టీలకు గడిచిన 2021-22 సంవత్సరానికి వచ్చిన విరాళాల వివరాలను ఏడీఆర్ నివేదిక వెళ్లడించింది. అయితే.. దేశంలోనే ఎక్కువగా విరాళాలు పొందిన ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ నిలచింది. అయితే.. రెండో ప్లేస్‌లో మాత్రం మొన్ననే జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన ఆమ్ ఆద్మీ పార్టీ నిలచింది. ఇక.. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చి వచ్చిన విరాళాల వివరాల ప్రకారం.. నివేదికలో ఐదో స్థానంలో నిలిచింది.

ప్రధానాంశాలు:

  • ప్రాంతీయ పార్టీలకు వచ్చిన వివరాలను వెల్లడించిన ఏడీఆర్
  • దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ
  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఐదో స్థానం

దేశంలోనే బీఆర్ఎస్ (Bharat Rashtra Samithi) పార్టీ టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఎందులో టాప్ అనేగా మీ డౌటనుమానం.. గడిచిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ పార్టీలకు వచ్చిన విరాళాల్లో.. బీఆర్ఎస్ పార్టీ నెంబర్ వన్ పొజిషన్‌లో ఉంది. ఆ తర్వాతి ప్లేస్‌లో ఆప్ (Aam Aadmi Party) ఉంది. అసోసియేషన్‌ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్‌(ADR) అనే నివేదిక ప్రకారం.. బీఆర్ఎస్ పార్టీకి మొత్తం 40.9 కోట్ల రూపాయల విరాళాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి.. 38.2 కోట్లు వచ్చినట్టు సమాచారం. మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ అయిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSR Telangana Party) కి 20 కోట్ల విరాళాలు రాగా.. ఐదో స్థానంలో ఉంది.

అయితే.. బీఆర్‌ఎస్, ఆప్‌ తర్వాత.. జేడీఎస్‌కు అత్యధిక విరాళాలు అందినట్టు తెలుస్తోంది. జేడీఎస్‌కు 33.2 కోట్ల రూపాయలు విరాళాలు వచ్చినట్టు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీకి 29.7 కోట్ల రూపాయలు విరాళాలు అందినట్టు నివేదిక పేర్కొంది. అయితే.. ఆయా ప్రాంతీయ పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాల ఆధారంగా.. ఈ గణాంకాలను నివేదిక వెల్లడించింది. దేశంలో మొత్తం 26 ప్రాంతీయ పార్టీలుండగా.. వాటన్నింటికీ కలిపి మొత్తంగా 189.8 కోట్ల విరాళాలు వచ్చినట్టు నివేదిక వివరించింది. అయితే.. అందులో 162.21 కోట్ల రూపాయలు కేవలం ఐదు పార్టీలకే రావటం విశేషం.

మరోవైపు.. ఏఐఏడీఎంకే, బీజేడీ, ఎస్‌డీఎఫ్, ఎన్డీపీపీ, ఏఐఎఫ్‌బీ, జేకేఎన్‌సీ, పీఎంకే పార్టీలు మాత్రం తమకు వచ్చిన విరాళల వివరాలను ఆ పార్టీకి చెందిన నేతలు ఇవ్వకపోవటం గమనార్హం. అయితే.. బీఆర్ఎస్‌కు ఎన్నికల సంఘం జాతీయ పార్టీగా గుర్తించకపోగా... ఈ నెలలోనే ఆమ్ ఆద్మీ పార్టీకి ఈసీ జాతీయ పార్టీగా గుర్తించింది. దీంతో.. ఆప్‌ను ప్రాంతీయ పార్టీగా గుర్తించి నివేదికలో.. ఆ పార్టీకి వచ్చిన విరాళాల వివరాలు అందించారు.


abc