Skip to main content
Source
oktelugu
https://oktelugu.com/adr-report-over-rs-250-crore-donations-to-bjp-in-2022-23/
Author
Raj Shekar
Date

దేశంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావించిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఇటీవలే ముగిశాయి. ఇందులో ఉత్తరాధిలోని మూడు రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసింది.

ADR Report: రాజకీయ పార్టీలకు వివిధ సంస్థలు లేదా వ్యక్తులు విరాళాలు ఇవ్వడం సహజమే. అయితే కొన్ని సంస్థలు కొన్ని పార్టీలకు భారీ మొత్తంలో విరాళాలు ఇస్తున్నాయి. ఆ విరాళాలు చూస్తే మైండ్‌ బ్లాక్‌ అవుతుంది. తాజాగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి భారీ మొత్తంలో విరాళాలు అందాయి. ప్రముఖ ఎన్నికల విరాళాల నిర్వహణ సంస్థ ఏడీఆర్‌ తన నివేదికలో ఈ విషయం వెల్లడించింది.

బీజేపీకి రూ.259 కోట్లు విరాళం
దేశంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావించిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఇటీవలే ముగిశాయి. ఇందులో ఉత్తరాధిలోని మూడు రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసింది. మరోవైపు జనవరి 22న అయోధ్య రామాలయం ప్రారంభించేందుకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ రామమందిరం ప్రారంభించనున్నారు. ఇది బీజేపీకి ప్లస్‌ పాయింట్‌గా మారే అవకాశం ఉంది. ఈ ఉత్సాహంలో లోక్‌సభ ఎన్నికలు కాస్త ముందుగానే జరిపించాలని భారతీయ జనతాపార్టీ భావిస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీకి భారీగా విరాళాలు అందడం మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. 39 కంపెనీలు వివిధ పార్టీలకు విరాళాలు అందించగా అందులో బీజేపీకి 259.08 కోట్లు అందినటుల ఏడీఆర్‌ తెలిపింది. మొత్తం విరాళాల్లో 70.69 శాతం బీజేపీకి అందినట్లు వెల్లడించింది. తెలంగాణకు చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీకి రూ.90 కోట్లు 24.56 శాంత విరాళంగా అందినట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైసీపీతోపాటు ఆప్, కాంగ్రెస్‌ పార్టీలకు రూ.17.40 కోటుల విరాలంగా అందినట్లు వివరించింది.

2022–23 ఆర్థిక సంవత్సరం లెక్కలివీ..
పైన పేర్కొన్న విరాళాలన్నీ 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవి అని ఏడీఆర్‌ తెలిపింది. గతేడాది డిసెంబర్‌ వరకు తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉంది. దీంతో ఆ పార్టీకి కూడా భారీగా విరాళాలు అందాయి. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి గరిష్టంగా విరాళాలు వచ్చాయి. మొత్తం విరాళాల్లో బీజేపీకి 70 శాతం రావడం గమనార్హం. అధికారంలో ఉన్న పార్టీలకే కార్పొరేట్‌ సంస్థలు ఎక్కువగా విరాళాలు ఇవ్వడం గమనార్హం.