Skip to main content
Source
News18
https://telugu.news18.com/news/business/29-of-current-30-cms-are-crorepatis-adr-analysis-details-inside-kmv-1725886.html
Author
Khalimastanvali
Date
City
Hyderabad

AP CM | దేశంలోని ముఖ్యమంత్రుల్లో ఎవరు ధనవంతులు? టాప్ 3లో ఎవరెవరు ఉన్నారు? ఆస్తి తక్కువగా ఉన్న సీఎం ఎవ్వరూ? వంటి అంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

YS Jagan | దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తులు ఎంత? ఎవరికి ఎక్కువ ఆస్తులు ఉన్నాయి? ఎవరికి తక్కువగా ఉన్నాయి? టాప్ సంపన్న సీఎంలు (CM) ఎవరు? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలోని మొత్తం 30 మంది సీఎంలలో 29 మంది కోటీశ్వరులే (Crorepati). మరి 29 మంది కోటీశ్వరులు అయితే మిలిగిన ఒక్కరూ ఎవరు? ఈ 29 మందిలో ఎవరు టాప్‌లో ఉన్నారు? అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలోని అందరు ముఖ్యమంత్రుల్లో కెల్లా ఏసీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టాప్‌లో ఉన్నాయి. ఈయన ఆస్తుల విలువ రూ. 510 కోట్లు. అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) ఈ విషయాన్ని వెల్లడించింది. ఏడీఆర్ ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించి ఈ విషయాన్ని ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందరి కన్నా ఎక్కువ ఆస్తులతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నారు. 

 అందరి ముఖ్యమంత్రుల్లో కెల్లా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆస్తులు చాలా తక్కువగా ఉన్నాయి. ఈమె ఆస్తుల విలువ రూ. 15 లక్షలు. మమతా కాకుండా మిగతా వారందరికీ రూ.కోటికి పైగా ఆస్తి ఉంది. 30 మంది ముఖ్యమంత్రుల్లో 28 మంది రాస్ట్రాల సీఎంలు, ఇద్దరు కేంద్ర పాలిత ప్రాంతాలకు (ఢిల్లీ, పాండిచేరి) చెందిన వారు ఉన్నారు. జమ్మూ కశ్మీర్‌కు ముఖ్యమంత్రి లేరు.

గ్యాస్ సిలిండర్ ఎన్ని రోజులు వస్తుంది? గంటసేపు స్టవ్ వెలిగిస్తే ఎంత గ్యాస్ అయిపోతుంది? 

 ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం.. 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మందికి సగటున రూ. 33.96 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయి. ఈ 30 మంది ముఖ్యమంత్రుల్లో 13 మందిపై సీనియర్ క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంటే నాన్ బెయిలబుల్ శిక్షలు అని అర్థం చేసుకోవచ్చు. తప్పు చేసినట్ల తేలితే ఐదేళ్లకు పైగా శిక్ష పడుతుంది.

ధనిక సీఎంలలో టాప్ 3 ముఖ్యమంత్రులను గమనిస్తే.. జగన్ తర్వాతి స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమ ఖండూ ఉన్నారు. ఈయన ఆస్తి విలువ రూ. 163 కోట్లు. ఇక మూడో స్థానంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయన్ ఉన్నారు. ఈయన ఆస్తుల విలువ రూ. 63 కోట్లు. తక్కువ ఆస్తి కలిగిన సీఎంలను గమనిస్తే.. మమతా బెనర్జీ ఆస్తి విలువ రూ. 15 లక్షలుగా, కేరళ సీఎం పినరాయి విజయన్ ఆస్తుల విలువ రూ.కోటి, హరియాణ సీఎం మనోహర్ లాల్ ఆస్తి విలువ రూ. కోటిగా ఉన్నాయి. బీహార్, ఢిల్లీ సీఎంలు నితీశ్ కుమార్, అర్వింద్ కేజ్రీవాల్ ఆస్తుల విలువ రూ. 3 కోట్లుగా ఉంది.


abc