Donations to Parties: ప్రాంతీయ పార్టీల విరాళాల అంశంలో బీఆర్ఎస్ టాప్‍లో నిలిచింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక విరాళాలు అందుకున్న పార్టీగా బీఆర్ఎస్ నిలిచింది.
Donations to Parties: ప్రాంతీయ పార్టీలకు విరాళాల విషయంలో భారత రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi - BRS - ఒకప్పుడు TRS) దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక విరాళాలు దక్కించుకున్న ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ప్రాంతీయ పార్టీల విరాళాల గణాంకాలతో కూడిన నివేదికను అసోసియేషన్ ఫర్ డెమక్రటిక్ రిఫార్మ్స్ (ADR) వెల్లడించింది. భారత ఎన్నికల సంఘానికి ఆ రాజకీయ పార్టీలు సమర్పించిన విరాళాల ఆధారంగా ఈ రిపోర్టును ఏడీఆర్ రూపొందించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.40.9 కోట్ల విరాళాలతో బీఆర్ఎస్ (గతంలో టీఆర్ఎస్) అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత రెండో ప్లేస్‍లో ఆమ్ఆద్మీ పార్టీ (Aam Aadmi Party - AAP) ఉంది. 2,916 విరాళాల నుంచి రూ.38.24 కోట్లను ఆప్ పొందించింది. మొత్తంగా 26 ప్రాంతీయ రాజకీయ పార్టీల విరాళాల లెక్కలను ఏడీఆర్ నివేదికలో పేర్కొంది. ఆ వివరాలు ఇవే.
Donations to Parties: 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ పార్టీలు విరాళాల గురించి ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాలను ఏడీఆర్ తన నివేదికలో పొందుపరిచింది. మొత్తంగా 26 రాజకీయల పార్టీలకు ఆ ఆర్థిక సంవత్సరంలో 5,100 విరాళాల ద్వారా రూ.189.80 కోట్లు దక్కినట్టు పేర్కొంది. ఏఐడీఎంకే, బీజేడీ, నేషనలిస్ట్ డెమక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ (NDPP), సిక్కమ్ డొమక్రటిక్ ఫ్రంట్ (SDF), ఏఐఎఫ్‍బీ, పీఎంకే, జేకేఎన్‍సీ పార్టీలు తమ విరాళాల వివరాలను సమర్పించలేదని ఏడీఆర్ పేర్కొంది.
టాప్-5 ఇవే
Donations to Parties: 2021-22 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక విరాళాలు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో బీఆర్ఎస్, ఆప్, జనతా దళ్ యునైటెడ్ (JDU), సమాజ్‍వాదీ పార్టీ (SP), యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP) తొలి అయిదు స్థానాల్లో ఉన్నాయి. రూ.33.25 కోట్ల విలువైన విరాళాలు పొందిన జేడీయూ మూడో స్థానంలో నిలిచింది. రూ.29.79 కోట్లతో అత్యధిక విరాళాలు పొందిన ప్రాంతీయ పార్టీల జాబితాలో సమాజ్‍వాదీ నాలుగో స్థానంలో నిలించింది. ఇక ఆంధ్రప్రదేశ్‍లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్‌సీపీ 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.20.01 కోట్ల విరాళాలను పొందింది. ప్రాంతీయ పార్టీల విరాళాల విషయంలో ఆ సంవత్సరానికి గాను అయిదో స్థానంలో నిలిచింది.
Donations to Parties: మొత్తం విరాళాల్లో ఐదు ప్రాంతీయ పార్టీలకే 85.46 శాతం (రూ.162.21 కోట్లు) దక్కాయని ఏడీఆర్ విశ్లేషించింది. ఆ ఐదు మినహా మిగిలిన అన్ని పార్టీలకు రూ.28కోట్ల విలువైన విరాళాలే వచ్చాయి. “2021-22 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక విరాళాలను అందుకున్నట్టు వెల్లడించిన టాప్-5 ప్రాంతీయ పార్టీలు టీఆర్ఎస్, ఆప్, జేడీయూ, ఎస్‍పీ, వైఎస్ఆర్‌సీపీ. ఇందులో కిందటి ఏడాదితో పోలిస్తే జేడీయూ మినహా మిగిలిన పార్టీలకు విరాళాల మొత్తం పెరిగింది” అని ఏడీఆర్ నివేదికలో పేర్కొంది.
Donations to Parties: 2021-22 ఆర్థిక సంవత్సరంలో అన్ని ప్రాంతీయ పార్టీలు కలిపి రూ.50లక్షల కన్నా ఎక్కువైన 45 విరాళాలను అందుకున్నాయి. ఆమ్ఆద్మీ, బీఆర్ఎస్, శిరోమణి అకాలీ దళ్, వైఎస్ఆర్‌సీపీ ఇందులో ఉన్నాయి.
Donations to Parties: 2020-21తో పోలిస్తే 2021-22 ఆర్థిక సంవత్సరంలో విరాళాలు ఎక్కువగా పెరిగిన పార్టీగా వైఎస్ఆర్‌సీపీ నిలిచిందని ఏడీఆర్ రిపోర్టు పేర్కొంది. కార్పొరేట్/వ్యాపార రంగం నుంచే ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ విరాళాలు వచ్చాయి. ఈ రంగం నుంచే రూ.136 కోట్ల వరకు డొనేషన్లు అందాయని ఏడీఆర్ నివేదిక స్పష్టం చేసింది.