జాతీయ పార్టీలకు 2022-23లో అజ్ఞాత వనరుల నుంచి వచ్చిన మొత్తం ఆదాయంలో 82 శాతానికిపై గా ఎలక్టోరల్ బాండ్ల నుంచే వచ్చినట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) వెల్లడించింది.
Electoral Bonds | న్యూఢిల్లీ, మార్చి 7: జాతీయ పార్టీలకు 2022-23లో అజ్ఞాత వనరుల నుంచి వచ్చిన మొత్తం ఆదాయంలో 82 శాతానికిపై గా ఎలక్టోరల్ బాండ్ల నుంచే వచ్చినట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆర్థిక నివేదికల ప్రకారం.. అజ్ఞాత వ నరుల ద్వారా వచ్చిన రూ.1,832.88 కోట్ల లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన ఆదా యం రూ.1,510 కోట్లు అని తేలింది. మొత్తం ఆదాయంలో ఇది 82 శాతం.
ఆరు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, బీఎస్‌పీ, ఆమ్‌ఆద్మీ పార్టీ, నేషనల్ పీపుల్స్ పార్టీల ఆదాయాలపై అధ్యయనం జరిగింది. అత్యధికంగా బీజేపీకి అజ్ఞాత మూలాల నుంచి రూ.1400 కోట్లు వచ్చింది. అంటే 76 శాతం ఆదాయం ఇలా వచ్చినదే. ఆ తర్వాత స్థానంలో 315.11 కోట్లు వచ్చాయని కాంగ్రెస్ ప్రకటించింది. రూ. 20 వేల కంటే ఎక్కువ లేదా అం తకంటే తక్కువ కూపన్లు లేదా ఎలక్టోరల్ బాం డ్ల విక్రయం ద్వారా లేదా తెలియని ఆదాయ వనరుల నుంచి స్వచ్ఛంద విరాళాలుగా ఎ లాంటి నిధులు స్వీకరించలేదని బీఎస్‌పీ ప్రకటించిందని ఎడీఆర్ తెలిపింది.
జాతీయ పార్టీలలాగే రాష్ట్రీయ పార్టీలు కూడా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు పొందాయని ఏడీఆర్ పేర్కొన్నది. 2004-05 నుంచి 2022-23 మధ్యకాలంలో జాతీయ పార్టీలు తెలియని మూలాల నుంచి రూ.19,083 కోట్లు వసూలు చేశాయని ఏడీఆర్ వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆరు జాతీయ పార్టీల మొత్తం ఆదాయం రూ.3,076.88కోట్లుగా ఏడీఆర్ పేర్కొన్నది. రూ.20వేల లోపు విరాళం ఇచ్చే వ్యక్తులు లే దా సంస్థల వివరాలు ప్రస్తుతం వెల్లడించాల్సిన అవసరం లేదు. రాజకీయ నిధుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేదుకు కట్టుదిట్టమైన చర్యలు అవసరమని ఏడీఆర్ సంస్థ సూచించింది. సమాచార హక్కు చట్టం కింద దాతలందరి వివరాలు బహిర్గతం చేయాలని సంస్థ వాదిస్తున్నది. విరాళాల మొత్తంతో సంబంధం లేకుండా చెల్లింపు విధానాన్ని ఆదాయపు పన్ను శాఖ, ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆడిట్ నివేదికలో ప్రకటించాలని సంస్థ ప్రతిపాదిస్తున్నది.
ఎస్బీఐపై కోర్టు ధిక్కార పిటిషన్
సుప్రీంకోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించిందంటూ ఎస్బీఐపై ధిక్కార చర్య తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మార్చి 6లోగా ఎన్నికల సంఘానికి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు ఎన్‌క్యాష్ చేసిన వివరాలను బ్యాంకు వెల్లడి చేయాల్సి ఉండింది. గడువు ముగిసినా ఎస్బీఐ ఎన్నికల సంఘానికి ఈ వివరాలు వెల్లడించలేదు. దీంతో ఎస్బీఐపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్జీవోస్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫా మ్స్ అండ్ కామన్ కాజ్ తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దావా వేశారు. ఈ వ్యాజ్యా న్ని సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం పరిగణనలోకి తీసుకున్నది. అయితే బాండ్ల వివరాలు వెల్లడించేందుకు గడువును జూన్ 30 వరకు పొడిగించాలని ఎస్బీఐ మార్చి 4న కోర్టును ఆశ్రయించింది. దీనిపై మార్చి 11న విచారణ జరగనున్నది. అదే రోజు దానితోపాటు ధిక్కార పిటిషన్‌ను కూడా విచారించాలని భూషణ్ కోరారు.