దేశంలోని వివిధ పార్టీలకు విరాళాలు అందుతాయన్న విషయం తెలిసిందే. అయితే 2021-22 ఆర్థిక సంవత్సరానికి 26 ప్రాంతీయ పార్టీలకు రూ.189.80 కోట్లు సమకూరాయి. అందులో అత్యధికంగా 5 పార్టీలు అత్యధిక వాటా దక్కించుకున్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ వెల్లడించింది.
దేశంలోని వివిధ పార్టీలకు విరాళాలు అందుతాయన్న విషయం తెలిసిందే. అయితే 2021-22 ఆర్థిక సంవత్సరానికి 26 ప్రాంతీయ పార్టీలకు రూ.189.80 కోట్లు సమకూరాయి. అందులో అత్యధికంగా 5 పార్టీలు అత్యధిక వాటా దక్కించుకున్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ వెల్లడించింది. తెరాస(ప్రస్తుతం భారాస) , జేడీయూ, ఆప్, సమాజ్‌వాది పార్టీ, వైకాపాలకు రూ.162.21 కోట్లు అందాయని తెలిపింది. ఆయా పార్టీలు ఎన్నికల సంఘం ఈసీకి సమర్పించిన వివరాల ఆధారంగా ఈ గణంకాలు వెల్లడించింది. అలాగే విరాళాల రూపంలో రూ.20 వేలకు పైన, అంతకన్న తక్కువ మొత్తాల్లో అందిన వివరాలు 26 ప్రాంతీయ పార్టీలు ఈసీకి తెలియజేశాయి. ఇదే ఏడాదికి బీజేడీ, ఎన్‌డీపీపీ, ఏఐఏడీఎంకే,ఎస్‌డీఎఫ్, ఏఐఎఫ్‌బీ, పీఎంకే, జేకేఎన్‌సీ పార్టీలు తమ విరాళాల వివరాలను వెల్లడించింది.
అయితే ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక విరాళాలు దక్కించుకున్న పార్టీగా భారాస అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఒక్క పార్టీకి 2021-22లో 14 విరాళాల ద్వారా రూ.40.90 కోట్లు అందాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 2,619 విరాళాల ద్వారా రూ.38.24 కోట్లతో రెండవ స్థానాన్ని దక్కించుకుంది. అలాగే జేడీయూ రూ.33.26 కోట్లతో మూడో స్థానంలో, రూ.29.80 కోట్లతో ఎస్పీ నాలుగో స్థానంలో, రూ.20 కోట్లతో వైఎస్సార్‌సీపీ అయిదో స్థానంలో ఉన్నాయి.