Skip to main content
Date

హర్యానాలో కొత్తగా కొలువు దీరిన  కేబినెట్ లో మంత్రులందరూ కోటీశ్వరులేనని ADR నివేదిక వెల్లడించింది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలాతో సహా మొత్తం 12 మంది మంత్రులు కోటిశ్వరులేనని తెలిపింది. 2014 లో 10 మంది మంత్రులలో ఏడుగురు మాత్రమే కోటీశ్వరులు కాగా ఇప్పుడు  12 మంది మంత్రులు కోటీశ్వరులు. వీరి సగటు ఆస్తులు 17.41 కోట్లుగా ఉన్నాయి.

అత్యధికంగా 76.75 కోట్ల రూపాయల ఆస్తులతో లోహారుకు చెందిన జై ప్రకాష్ దలాల్ (వ్యవసాయ మంత్రి), తర్వాత రూ. 74.77 కోట్లతో  ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా సెకండ్ ప్లేసులో ఉన్నారు. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు  రూ. 1.27 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఈ 12 మంది మంత్రుల్లో 10 మంది డిగ్రీ చదవగా మిగతా వారు ఇంటర్ చదివారు.


abc