Source
Sakshi
https://www.sakshi.com/telugu-news/politics/adr-report-bjp-rs-614-crore-congress-rs-94-crore-donation-1525975
Date
City
New Delhi
2021–22లో బీజేపీకి రూ.614 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.95 కోట్లు విరాళాల రూపంలో అందాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) నివేదిక ఈ మేరకు వెల్లడించింది. 2020–21తో పోలిస్తే పార్టీలు అందుకున్న విరాళాల మొత్తం 31.50% మేర పెరిగిందని వివరించింది.
ఇదే సమయంలో బీజేపీ విరాళాల్లో రూ.28.71%, కాంగ్రెస్ విరాళాల్లో 28.09% పెరుగుదల కనిపించిందని నివేదిక పేర్కొంది. గతేడాది దేశంలోని అన్ని జాతీయ పార్టీలకు మొత్తం రూ.780కోట్లు విరాళాల రూపంలో అందినట్లు చెప్పింది. బీజేపీకి అందిన మొత్తం మిగతా అన్ని పార్టీలకంటే దాదాపు మూడు రెట్లు అధికం కావడం గమనార్హం.