Skip to main content
Source
Telugu Samayam
https://telugu.samayam.com/latest-news/india-news/ys-jagan-mohan-reddy-the-richest-chief-minister-in-india/articleshow/99434832.cms
Author
Shivakumar Basani
Date

Richest CM: అసోసియేషన్​ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్​ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్​ (ఎన్ఈడబ్ల్యూ) సంస్థలు తాజాగా కీలక నివేదిక విడుదల చేశాయి. దీంట్లో ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను వెల్లడించాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడవిట్​లను విశ్లేషించి.. ఈ నివేదిక రూపొందించినట్లు ఆ సంస్థలు స్పష్టం చేశాయి. ఈ నివేదిక దేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలవగా.. బెంగాల్ సీఎం దీదీ ఆఖరి స్థానంలో ఉన్నారు.

ప్రధానాంశాలు:

  • ఏడీఆర్, ఎన్ఈడబ్ల్యూ కీలక నివేదిక విడుదల
  • దేశంలో సంపన్న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్
  • తక్కువ ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రిగా దీదీ

Richest CM: దేశంలోని ముఖ్యమంత్రుల్లో.. ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ.510 కోట్లుగా ఉంది. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. అంతేకాదు.. ఇప్పుడున్న 30 మంది ముఖ్యమంత్రుల్లో.. 29 మంది కోటీశ్వరులేనని.. వీరిలో YS Jagan Mohan Reddy టాప్‌లో ఉండగా.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆఖర్లో ఉన్నారు. ఆమె ఆస్తులు కేవలం రూ.15 లక్షలే అని ఏడీఆర్, ఎన్ఈడబ్ల్యూ వెల్లడించింది.

దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో 97 శాతం.. అంటే 29 మంది కోటీశ్వరులు ఉన్నారు. ఒక్కో ముఖ్యమంత్రి సగటు ఆస్తి రూ.33.96 కోట్లుగా ఉంది. రూ.510 కోట్లతో జగన్ మొదటి స్థానంలో.. రూ.163 కోట్లతో అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ రెండో స్థానంలో.. రూ.63 కోట్లతో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మూడో స్థానంలో ఉన్నారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ ఆస్తులు రూ.23 కోట్లు అని ఏడీఆర్, ఎన్ఈడబ్ల్యూ వెల్లడించింది.

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆస్తి రూ.15 లక్షలు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆస్తి కోటి రూపాయలు, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆస్తి కోటి రూపాయల పైనే ఉందని.. ఏడీఆర్, ఎన్ఈడబ్ల్యూ నివేదికలు వెల్లడించాయి. బీహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ఆస్తి రూ.3 కోట్లు , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రూ.3 కోట్లకు పైగా ఉంది. ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆస్తులు కోటి రూపాయలకు పైగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది.


abc